జేసన్ సంజయ్ సిగ్మా చిత్రం ఘన విజయం సాధించాలి

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిగ్మా సినిమా అఖండ విజయం సాధించాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆకాంక్షించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజయ్ కుమారుడు సంజయ్ డైరెక్షన్లో సినిమా అనగానే రాకుండా ఉండలేకపోయానని తెలిపారు. ఈ సినిమా బ్లాక్బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, దర్శకుడు జేసన్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.