ఉత్తరాంధ్రలో వానల బీభత్సం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన అధికారులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది.