బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ బంగ్లాలో అనధికార నిర్మాణాలు కూల్చివేత
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబయి
ముంబయిలోని జుహు ప్రాంతంలో ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ బంగ్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అనధికార నిర్మాణాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారని ముంబయి వర్గాలు వెల్లడించాయి. సుమారు ఏడు వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో గోడలు, కిటికీల మార్పులు చేపట్టగా, గతంలో నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.