మూత్రవిసర్జనకు వెళ్లకుండా డైపర్లు వేసుకోవాలని వేధింపులకు గురిచేస్తున్న కంపెనీ సూపర్వైజర్
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలోని సింప్లీఫ్రెష్ కంపెనీలో రోజుకు రూ.400 వేతనం ఇస్తూ మహిళా కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారు. పనివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లకుండా డైపర్లు వేసుకోవాలని, తనతో సాన్నిహిత్యంగా ఉంటేనే వేతనాలు పెంచుతానని సూపర్వైజర్ అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులపై పోలీసులు స్పందించి ఫిర్యాదు చేయాలని కోరినా, ఉద్యోగాలు పోతాయన్న భయంతో కార్మికులు వెనుకంజ వేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.