స్ఫూర్తిదాయకం: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఒకేసారి మూడు బంగారు పతకాలు సాధించిన శ్రీ అశ్విత

రిపోర్టర్: హరి స్థలం: Atmakur

పట్టుదలతో చదివితే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆత్మకూరుకు చెందిన బొజ్జనపల్లి శ్రీ అశ్విత నిరూపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎస్సీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె, తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ఒకేసారి మూడు బంగారు పతకాలను అందుకున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కూచిపూడి నృత్యంలోనూ రాణిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.