దాండియా వేడుకల్లో ఘోరం: ఫ్లడ్ లైట్ల స్టాండ్ కూలి విద్యార్థిని మృతి

రిపోర్టర్: హరి స్థలం: Rangareddy

రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఘోర ప్రమాదంలో సోనా అనే బీటెక్ విద్యార్థిని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన దాండియా వేడుకల్లో ఈదురుగాలులకు భారీ ఫ్లడ్ లైట్ల ఐరన్ స్టాండ్ విద్యార్థులపై కుప్పకూలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆమె సోదరితో పాటు మరో ఇరవై మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి.