హైదరాబాద్‌లో వైభవంగా ఖైరతాబాద్‌ 69 అడుగుల బడా గణేశ్ ఏర్పాట్లు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన బడా గణేశ్ విగ్రహ తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో 69 అడుగుల ఎత్తుతో పర్యావరణ హితంగా ఈ భారీ విగ్రహాన్ని శిల్పులు తీర్చిదిద్దుతున్నారు. రాజస్థాన్ మట్టి, స్టీల్, కర్రలను ఉపయోగించి వందలాది మంది కళాకారులు ఈ అద్భుత రూపాన్ని రూపొందిస్తున్నారు.