నెట్నూర్ బి లో పంటలను స్వయంగా పరిశీలించిన సర్పంచ్ లక్ష్మిన్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సిర్పూర్ (యు)
సిర్పూర్ యు మండలంలోని నెట్నూర్ బి గ్రామంలో గ్రామ సర్పంచ్ మడావి లక్ష్మిన్ రావు పారం పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల సాగు విధానంపై రైతులతో చర్చించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మడావి బాధిరావు, మేట్ గేడం లక్ష్మిన్ పాల్గొన్నారు.