పౌర స్పృహపై జస్వీర్ సింగ్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన వైనం
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
ప్రజలు కనీస పౌర స్పృహ మరియు వ్యక్తిగత గోప్యతను పాటించడం లేదని నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జస్వీర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమ వేదికగా ఆయన రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ మార్చుకోవాల్సిన కొన్ని కీలక అలవాట్లను పంచుకున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లలో వీడియోలు చూడటం, ఫోన్లలో బిగ్గరగా మాట్లాడటం వంటి ప్రవర్తనలపై ఆయన తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చడంతో ఈ అంశం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.