పాఠశాలల్లో ఆయుర్వేద జీవనశైలి అవగాహనకు రూ.ఆరున్నర కోట్లు మంజూరు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని 8,400 పాఠశాలల్లో విద్యార్థులకు ఆయుర్వేద జీవన విధానం, ఆహార నియమాలపై అవగాహన కల్పించేందుకు రూ.6.50 కోట్లు మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఆయుర్వేద సేవల విస్తరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఒక ప్రకటనలో వివరించారు.