రూ.60 కోట్లతో నెల్లూరులో ఆధునిక మార్కెట్ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విమర్శకుల నోళ్లు మూయించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని నవాపేటలో రూ.60 కోట్లతో ఆధునిక మార్కెట్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2028 నాటికి నెల్లూరును గ్రీన్ సిటీగా మారుస్తామని, గత ప్రభుత్వం వెనక్కి వెళ్లిన నిధులను మళ్లీ తెచ్చి పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు.