బెంగుళూరు రోడ్డు ప్రమాదం: కబాబ్ సెంటర్లోకి దూసుకెళ్లిన ఎస్యూవీ

రిపోర్టర్: అశోక్ స్థలం: Bengaluru

బెంగుళూరు శివారులోని బన్నెరఘట్ట ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా దూసుకొచ్చిన ఎస్యూవీ వాహనం రోడ్డు పక్కన ఆపిన మోటార్ సైకిళ్లను ఢీకొట్టి, సమీపంలోని కబాబ్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నూనె మరగబెడుతున్న పాత్ర బోల్తా పడి వేడి నూనె పడటంతో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. బన్నెరఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.