పుంగనూరు అరాచకాల కేసు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో భారీ షాక్

రిపోర్టర్: రమేష్ స్థలం: అన్నమయ్య జిల్లా

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పుంగనూరులో అరాచకాలకు తెగబడిన కేసుల్లో నిందితుడైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిందని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.