మతసామరస్యం చాటుతూ వినాయక లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్‌లో జరిగిన గణేష్ లడ్డూ వేలంలో చాందిని, మస్తాన్ వలి అనే ముస్లిం దంపతులు రూ. 1,45,000 వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు. మతాలకు అతీతంగా వారు చూపించిన భక్తిభావంపై స్థానికులు హర్షం వ్యక్తం చేయగా, ఉత్సవ కమిటీ సభ్యులు దంపతులను ఘనంగా సత్కరించారు.