తుఫాన్ బాధితులకు తానా ఆపన్నహస్తం: ఒంగోలులో భోజనాలు పంపిణీ చేసిన వైనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మైనంపాడు గ్రామంలో భారీ తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరఫున సహాయం అందించినట్లు తానా కోశాధికారి రాజా కసుకుర్తి తెలిపారు. తుఫాన్ ప్రభావంతో నివాసాల్లోకి వరదనీరు చేరి వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో, స్పందించిన తానా ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళలు, వృద్ధులకు పౌష్టికాహారంతో కూడిన భోజనాలను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే తమ సేవా లక్ష్యమని రాజా కసుకుర్తి పేర్కొన్నారు.