టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్
రిపోర్టర్: రమేష్
స్థలం: World
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అజేయ శతకంతో చెలరేగాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అతను, ఒకే కేలండర్ సంవత్సరంలో రెండు టీ20 సెంచరీలు సాధించిన తొలి పూర్తి సభ్య దేశాల కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.