భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవెండిలో గర్భిణులకు ఉచిత వైద్య శిబిరం

రిపోర్టర్: అశోక్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో ఐటీసీ, ఐవోజీ సంస్థల ఆధ్వర్యంలో గర్భిణులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మోరంపల్లిబంజర్ పీహెచ్‌సీ డాక్టర్ నగేష్ గర్భిణులకు పరీక్షలు చేసి, తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, చీరలు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశాలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.