పాలపిట్టల రక్షణ: హైదరాబాద్లో బోనుల్లో బంధించిన మూగజీవాలను కాపాడిన పోలీసులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను బోనుల్లో బంధించి వ్యాపారం చేయాలని చూసిన వ్యక్తుల చెర నుంచి వాటిని రక్షించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాలలో పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి నాలుగు మూగజీవాలను సురక్షితంగా కాపాడారు. వన్యప్రాణులను హింసిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.