హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెక్ భావోద్వేగం: తల్లిదండ్రుల మృతిపై ఆవేదన
రిపోర్టర్: నరేష్
స్థలం: Los Angeles
తల్లిదండ్రుల మరణం తనకు తీరని లోటని, వయసు పెరిగేకొద్దీ జీవితంపై కొత్త కోణం అలవడుతుందని ప్రముఖ హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది తన తల్లిదండ్రులను కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. జీవితం చాలా చిన్నదని, ఉన్న సమయంలోనే అందరితో సంతోషంగా గడపాలని ఆయన పేర్కొంటూ, తల్లితో తన అనుబంధాన్ని, ఆమె నేర్పిన పాఠాలను ఎమోషనల్ గా గుర్తుచేసుకున్నారు.