వినాయక నిమజ్జనంలో భర్త వేరే అమ్మాయితో డ్యాన్స్ చేశాడని భార్య ఆత్మహత్య
రిపోర్టర్: శివ
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోనాపూర్లో వినాయక నిమజ్జన వేడుకల్లో భర్త వేరే యువతితో డ్యాన్స్ చేయడంపై మనస్తాపం చెంది భార్య సంధ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. గురువారం జరిగిన నిమజ్జనంలో జంగు మద్యం తాగి వేరే అమ్మాయితో డ్యాన్స్ చేయగా, ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన సంధ్య ఇంట్లో పురుగుల మందు సేవించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.