వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ దాడులు అరాచకం: రేగిడి లక్ష్మణరావు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. కడపలో ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ శ్రేణులు కత్తులతో దాడికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. అన్నమయ్య జిల్లాలో నామినేషన్ పత్రాలు చించేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై భౌతిక దాడులకు తెగబడ్డారని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రత్యర్థుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.