బతుకమ్మ వేడుకల్లో షీ టీమ్ ప్రత్యేక నిఘా: ఈవ్టీజర్లకు పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా షీ టీమ్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎస్ఐ హైమ ఆదేశాల మేరకు షీ టీమ్ సిబ్బంది సాధారణ దుస్తుల్లో ప్రార్థనా మందిరాలు, సంబరాల ప్రాంగణాలలో విస్తృతంగా గస్తీ నిర్వహించారు. వేడుకల్లో మహిళలతో అకృత్యాలకు గానీ, ఈవ్ టీజింగ్కు గానీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కానిస్టేబుళ్లు శ్రవణ్ కుమార్, సతీష్, రాజేందర్, వనిత పర్యవేక్షించి స్పష్టం చేశారు.