డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహ వేడుకల నిధులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందన
రిపోర్టర్: రమేష్
స్థలం: Washington
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహ వేడుకల నిధుల వ్యవహారంపై స్పందించారు. రష్యన్ వ్యాపారవేత్త ఉమర్ క్రెమ్లెవ్ నిధులతో బహామాస్ లో వివాహ వేడుకలు నిర్వహించడంపై వస్తున్న విమర్శలను ఆయన సమర్థించారు. స్నేహితులు వివాహ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతుందని, అయితే తన కుమారుడు ఆ డబ్బును తిరిగి చెల్లిస్తున్నట్లు తనకు చెప్పాడని ట్రంప్ స్పష్టం చేశారు.