ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో క్రేన్కు సాంకేతిక సమస్య తలెత్తిన వైనం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఖైరతాబాద్

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభంలో ఊహించని అడ్డంకి ఎదురైంది. విగ్రహాన్ని ఎత్తే క్రేన్లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో యాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. విషయం తెలుసుకున్న ఉత్సవ కమిటీ వెంటనే అప్రమత్తమై నిపుణులైన టెక్నికల్ టీమ్ను రంగంలోకి దింపింది. సాంకేతిక సిబ్బంది హుటాహుటాన అక్కడికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి క్రేన్ను సురక్షితంగా సిద్ధం చేశారు. త్వరలోనే పూజా కార్యక్రమాలు ముగిసి శోభాయాత్ర వైభవంగా ముందుకుసాగనుంది.