జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యమన్న ఎమ్మెల్యే గణబాబు

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా వార్డు స్థాయిలో పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుని పార్టీ శ్రేణులను ముందుకు నడిపించాలని దిశానిర్దేశం చేశారు.