పాలకొండలో పద్మమ్మ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న మేకల సత్యబాబు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ మండలంలో మేకల సత్యబాబు విస్తృతంగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పద్మమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో డ్రైనేజ్, రోడ్డు, తాగునీరు తదితర సమస్యలను గుర్తించి పద్మమ్మ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కమ్యూనిటీ వాసులకు అన్నివిధాలా వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.