గుంతలమయంగా మారిన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న అధికారులు

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

తుపాను ప్రభావంతో విజయనగరం నగరంలో కురుస్తున్న వర్షాలకు రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలవడంతో గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా మరమ్మతుల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్‌ కళాశాల స్టేడియం, పద్మావతినగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పైడితల్లి అమ్మవారి పండగలోపు పనులు పూర్తి చేస్తామని కమిషనర్ బి.బాలస్వామి తెలిపారు.