నెల్లూరు జిల్లాలో 34.2 శాతం తగ్గిన నేరాలు: ఎస్పీ అజిత

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన సమీక్షలో నేరాలు గణనీయంగా తగ్గినట్లు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం నేరాలు 34.2 శాతం తగ్గి 3,296కు పడిపోయాయని తెలిపారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్ వారెంట్లను త్వరగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు.