అనుమాన పక్షి చిత్రం నుంచి వలో వలో సాంగ్ విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్న అనుమాన పక్షి చిత్రంలోని వలో వలో పాటను మేకర్స్ విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా మౌజమ్ వాని ఈ పాటను ఆలపించారు. రాగ్ మయూర్, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25, 2026 న ప్రేక్షకుల ముందుకు రానుంది.