ఖమ్మం జిల్లాను ముంచెత్తనున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం పరుగులు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. అక్టోబర్ 28న అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందరాదని ప్రజలకు సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.