పాతాళ గంగలో నీట మునిగి యువకుడి మృతి
రిపోర్టర్: dumarla bhaskar senier journalist
స్థలం: అమ్రాబాద్
శ్రీశైలం ఎడమ గట్టు పాతాళ గంగలో ఈరోజు ఉదయం గంగలోకి స్నానానికి వెళ్లిన ముంబైకి చెందిన ఓ యువకుడు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా నదిలో స్నానం చేసేందుకు ఇద్దరు యువకులు దిగారు నీటి ప్రవాహంలో ఇద్దరు యువకులు కొట్టుకుపోతున్నదా చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో సమీపంలో చేపల వేటలో ఉన్న మత్స్యకారులు గమనించి ఒకరిని రక్షించి ఒడ్డుకు చేర్చగా మరో యువకుడు సచిన్ రాజపుత్ర (22 ) ముంబైకి చెందిన యువకుడు మృతి చెందాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.