విజయవాడలో ఉద్రిక్తత, శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ టీచర్లు వైఎస్సార్సీపీ పోటాపోటీ నినాదాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ టీచర్లు, వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు చేయగా, తమ సర్టిఫికెట్లు నిజమైనవేనంటూ స్పోర్ట్స్ కోటా టీచర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆరోపణలు తమను ఎంతగానో బాధిస్తున్నాయని పేర్కొంటూ పలువురు టీచర్లు కన్నీటి పర్యంతమయ్యారు.