అక్టోబర్ 30న అన్నదాతల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ చేయనున్న సర్కార్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
ఏపీ కేబినెట్ నిర్ణయం మేరకు అక్టోబర్ ముప్పై నాడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని నలభై ఆరు లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మొత్తం మూడు వేల కోట్ల పైచిలుకు సాయం అందించనున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి ఏడు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.