నవరాత్రి వేడుకలు: జహీరాబాద్లో అక్టోబర్ 13న గ్రాండ్ గార్బా దాండియా నైట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జహీరాబాద్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని రాక్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో అక్టోబర్ పదమూడో తేదీన నవరాత్రి గార్బా మరియు దాండియా నైట్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మహిళలు మరియు యువతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటవుతున్న ఈ కార్యక్రమం అల్గోల్ రోడ్లోని పీవీఆర్ గార్డెన్స్లో జరగనుంది. నృత్యాలు, సంగీతంతో పాటు వినోదాన్ని పంచే ఈ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు ప్రజలకు పిలుపునిచ్చారు.