మొక్కజొన్న కొనుగోలు పేరుతో వ్యాపారికి భారీ టోకరా: సైబర్ మోసం గుట్టురట్టు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మేడ్చల్
మొక్కజొన్న కొనుగోలు పేరుతో యాప్రాల్ కు చెందిన వ్యాపారి లక్ష్మీనరసింహ కట్టి ఏడు లక్షలకు పైగా మోసపోయినట్లు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి సరుకు కొనుగోలుకు ఒప్పందం చేసుకుని ఆన్లైన్ లో డబ్బులు చెల్లించగా, అదనపు మొత్తం డిమాండ్ చేయడంతో మోసం బయటపడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.