పులివెందులలో ఉద్రిక్తత: వైఎస్ జగన్ ర్యాలీ వద్ద దస్తగిరిపై దాడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కడప
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని ప్రశ్నించేందుకు యత్నించగా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్ కు లేదా అని దస్తగిరి తీవ్రంగా నిలదీయడంతోపాటు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.