స్థానిక పోరులో ఆసక్తికర దృశ్యం: బరిలో తోడికోడళ్లు మరియు న్యాయవాదులు

రిపోర్టర్: హరి స్థలం: ఆచంట

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో స్థానిక ఎన్నికల నామినేషన్లు రసవత్తరంగా మారాయి. పెదమల్లం గ్రామానికి చెందిన తోడికోడళ్లు బోడపాటి మంగాదేవి, బోడపాటి మౌని సుప్రియలు సగంచెరువు ఎంపీటీసీ స్థానానికి పోటీ పడుతూ నామినేషన్లు వేశారు. అలాగే ఆచంట జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు న్యాయవాదులు బీరా నరసింహమూర్తి, మట్టా ఆనందకుమార్ నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.