రణ్బీర్ కపూర్ లవ్ అండ్ వార్ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
రిపోర్టర్: రాజేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లవ్ అండ్ వార్ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యుద్ధ నేపథ్యపు అంశాలతో కూడిన అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 21న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.