విశాఖ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

విశాఖపట్నంలో నవంబరు 12, 13 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. అక్టోబరు 8న దిల్లీలో సన్నాహక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ బ్రాండింగ్‌ పెంచేలా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించాలని, స్టార్టప్‌ల కోసం షార్క్‌ ట్యాంక్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి విశాఖ సదస్సులో ఒప్పందాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.