పల్లెపండగతో గ్రామీణ రహదారుల అభివృద్ధి: బైపాస్ రోడ్డును ప్రారంభించిన పవన్కల్యాణ్

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆత్మకూరు

పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రూ.8.91 కోట్లతో నిర్మించిన నాలుగులైన్ల బైపాస్ రోడ్డును మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ మార్గానికి వాయుపుత్ర మార్గ్గా నామకరణం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.