కేసీఆర్ భూముల పై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో గుంట భూమి కూడా లేదని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారిక రికార్డులను ఎక్స్ వేదికగా విడుదల చేస్తూ, ఆ సర్వే నంబర్లోని మొత్తం భూమి దాదాపు 250 మంది దళితుల పేర్ల మీదనే ఉన్నదని తెలిపారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే సభను తప్పుదోవ పట్టించిందని ఆయన తీవ్రంగా నిలదీశారు.