నాసిక్‌లో కిలో గోల్డెన్ మోదక్ ధర రూ.27 వేలు!

రిపోర్టర్: విజయ్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని నాసిక్‌లో వినాయక చవితి వేడుకల సందర్భంగా సాగర్ స్వీట్స్ విక్రయిస్తున్న గోల్డెన్ మోదక్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తినే బంగారంతో తయారు చేసే ఈ స్వీట్ ధర కిలో రూ.27 వేలకు చేరింది. గత ఐదేళ్లతో పోలిస్తే పసిడి ధరల పెరుగుదల కారణంగా ఈ మోదక్‌ల ధర భారీగా పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఈ స్వీట్ తయారీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.