బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విశాఖ జిల్లాలో పుట్టిన ఊరు వెళ్తుండగా తన వద్దనున్న ఎనిమిది తులాల బంగారం చోరీ కావడంతో మనస్తాపం చెందిన వృద్ధురాలు సిరిపురపు దేవుడమ్మ విజయనగరం మండలం కోరుకొండలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా నగలు రికవరీ కాకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి ఒైగట్టినట్లు పోలీసులు తెలిపారు.