నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఉపాధ్యాయ నియామక నిబంధనలపై ఎన్సీటీఈ కీలక నిర్ణయం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
ఉపాధ్యాయ నియామక అర్హత నిబంధనలను సమీక్షించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రెండు ప్రత్యేక నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షల మార్గదర్శకాలపై ఈ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి. నాలుగు సంవత్సరాల ఐటీఈపీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ఉపాధ్యాయ కొలువులకు అర్హులుగా గుర్తిస్తూ త్వరలోనే తగిన సవరణలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.