ఐక్యరాజ్యసమితి వద్ద నిరసన ప్రదర్శనలో నటి సుసన్ సర్దాన్ అరెస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూయార్క్
అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వెలుపల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసనలో ప్రముఖ ఆస్కార్ విజేత నటి సుసన్ సర్దాన్‌తో పాటు 30 మందిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. 'ఫండ్ పీపుల్ నాట్ బాంబ్స్' నినాదాలతో సాగిన ఈ ఆందోళనలో పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన నిర్వహిస్తున్న పలువురు నటులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.