ఈనెల 30లోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సెక్రటేరియట్లో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 30వ తేదీలోగా పారదర్శకంగా డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని, కాలనీలలో తాగునీరు, విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.