సోదరి ఆహ్వానాన్ని స్వాగతించిన మనోజ్ జరాంగే, దీపావళికి వస్తానని వెల్లడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మహారాష్ట్ర
మరాఠా రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరాంగే దీక్ష 13వ రోజుకు చేరింది. సీఎం ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ తనను భోజనానికి ఆహ్వానించడంపై జరాంగే స్పందించారు. సోదరిగా పిలిస్తే ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తానని, దీపావళి తర్వాత జరిగే భావ్‌బీజ్ పండగకు ఆమె ఇంటికి వెళ్తానని తెలిపారు. డిమాండ్ల సాధనకోసం సెప్టెంబర్ 12న చలో ముంబయి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.