చింతగూడలో రూ.10 లక్షలతో సిద్ధమైన నూతన ఐకేపీ మహిళా భవనం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన నూతన ఐకేపీ వివో భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ నిధులు పది లక్షల రూపాయలతో ఈ నిర్మాణం వేగంగా పూర్తయినట్లు స్థానిక సర్పంచ్ సుతారి సుమలత తెలిపారు. త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభించి మహిళా సభ్యులకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.