పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్: స్ లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా
రిపోర్టర్: రాము
స్థలం: Lahore
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ షాక్ ఇచ్చిందని ఐసీసీ అధికారులు తెలిపారు. శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో స్ లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టుకు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించినట్లు వెల్లడించారు. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ షాహిన్ షా అఫ్రిది తప్పును అంగీకరించారని ఐసీసీ పేర్కొంది.