సినిమా రంగంలో సరికొత్త చరిత్ర: మూడు వేల కోట్ల వైపు రామాయణం
రిపోర్టర్: వెంకట్
స్థలం: New Delhi
భారతీయ సాంస్కృతిక నేపథ్యంతో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించే అవకాశం ఉందని ప్రముఖ సినీ ప్రదర్శనకారుడు విశేక్ చౌహాన్ వెల్లడించారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్ లో నటిస్తున్న ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదల కానుందని, ఇది కేవలం సినిమా కాకుండా ప్రజల నమ్మకం అని ఆయన పేర్కొన్నారు.